No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Nov 26 2024 1:39 AM | Last Updated on Tue, Nov 26 2024 1:39 AM

No He

No Headline

శ్రీశైలంటెంపుల్‌: ఇలకై లాసమైన శ్రీశైలమహాక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు ఆధ్మాత్మికభరితంగా సాగుతున్నాయి. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శ్రీగిరికి భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, మల్లన్న దర్శనానికి బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఆలయ ద్వారాలను తెరచి దర్శనాలకు అనుమతించారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలు కిక్కిరిశాయి. ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర(శివ)మాఢవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన దీపారాధనలో పలువురు భక్తులు దీపాలు వెలిగించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

నేత్రపర్వంగా లక్షదీపోత్సవం, పుష్కరిణిహారతి

కార్తీకమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం లోక కల్యాణం కోసం పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పుష్కరిణి ప్రాంగణమంతా లక్ష దీపాలను ఏర్పాటు చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఆ దీపాలను వెలిగించారు. అలాగే సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్ద ఆశీనులు చేసి అర్చకులు, వేదపండితులు విశేష పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను శాస్త్రోక్తంగా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు కనులారా తిలకించి స్వామి అమ్మవార్లను దర్శించుకొని పరవశించిపోయారు. పూజా కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

మహానందిలో వైభవంగా జల హారతులు

మహానంది: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మహానందిలో రాత్రి గంగాజల హారతులు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్‌ అవధాని, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శంకరయ్య శర్మ, ముఖ్య అర్చకులు రాజారత్తయ్య బాబు, రాజమాణిక్య శర్మ, రాఘవ శర్మ ఆధ్వర్యంలో ముందుగా గంగాదేవికి విశేష పూజలు చేసి జలహారతులు ఇచ్చారు. వేలాది మంది భక్తులు తిలకించారు.

కార్తీక దీప కాంతులతో పుణ్య క్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. ఓం నమః శివాయ.. హర..హర..మహాదేవా.. శంభో శంకరా..

అంటూ భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలైనా శ్రీశైలం, మహానంది, యాగంటి, కాచింతల భక్తులతో పోటెత్తాయి. శ్రీగిరిలో లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కనుల

పండువగా జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline1
1/1

No Headline

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement