బలవంతపు సభ్యత్వం! | - | Sakshi
Sakshi News home page

బలవంతపు సభ్యత్వం!

Published Tue, Nov 26 2024 1:38 AM | Last Updated on Tue, Nov 26 2024 1:38 AM

బలవంత

బలవంతపు సభ్యత్వం!

మొక్కుబడి తంతు

ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో గ్రామాల్లోకి వెళ్తే తమను నిలదీస్తారనే ఉద్దేశంతో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలెవరూ సభ్యత్వ నమోదుపై ముందడుగు వేయడానికి సంకోచిస్తున్నారు. మొక్కుబడిగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అయితే, పార్టీ సభ్యత్వ నమోదులో వెనుకబడితే తామెక్కడ చీవాట్లు తినాల్సి వస్తుందోనన్న తలంపుతో నేతలు అడ్డదారిని ఎంచుకున్నారు. ఎక్కువ సభ్యత్వాలు కావాలంటే స్వయం సహాయక సంఘాల సభ్యులను చేర్చడమే ఉత్తమమని ఆ పార్టీ నాయకులు భావించి ఇలా చేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.

డ్వాక్రా సంఘాల సభ్యులపై

తెలుగు తమ్ముళ్ల బెదిరింపుల పర్వం

టీడీపీ సభ్యత్వం తీసుకోవాల్సిందేనని

ఒత్తిడి

సంక్షేమం అందాలంటే

తప్పని సరి అని స్పష్టీకరణ

జిల్లాలో దాదాపు 31,624 పొదుపు

సంఘాలు

సంతకం పెట్టాల్సిందేనని

ఫోన్లు చేసి మరీ ఆదేశాలు

నంద్యాల(అర్బన్‌): అధికారం కోసం చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో హామీలతో ప్రజలను ఎలా మభ్య పెట్టారో ఇప్పుడు సభ్యత్వ నమోదు కోసం ఆ పార్టీ నేతలు కూడా అడ్డదారులు తొక్కుతున్నారు. పథకాలు అందాలంటే పార్టీలో సభ్యత్వం తీసుకోవాల్సిందేనని ఒత్తిళ్లు చేస్తున్నారు. ఇష్టం ఉన్నా లేకున్నా ఇది తప్పనిసరి అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ప్రధానంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఫోన్లు చేసి మరీ బలవంతంగా పార్టీ సభ్యత్వం అంటగడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఒత్తిడి చేసి పార్టీలో చేర్చు కోవడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో 31,624 పొదుపు సంఘాల్లో 3,34,604 మంది సభ్యులు ఉన్నారు.

ఇదీ సంగతి...

అలవిగాని హామీలు ఇచ్చి, సార్వత్రిక ఎన్నికల్లో గట్టెక్కిన టీడీపీ తాజాగా సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టింది. పార్టీలో బలవంతంగా చేర్చుకుంటూ, అదంతా తమ బలమేనని చెప్పుకోవడానికి వ్యూహం రచించింది. ఇందులో భాగంగా అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. దీనిపై జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టారు. అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో తెలుగుదేశం సభ్యత్వ నమోదుకు అశించిన మేర స్పందన కనిపించడం లేదు. చేసేది లేక ఆ పార్టీ నేతలు అధికారం అండతో అడ్డదారులను ఎంచుకున్నారు.

మహిళలే టార్గెట్‌...

సభ్యత్వ నమోదులో చతికిలపడిన తెలుగు తమ్ముళ్లు స్వయం సహాయక సంఘాల మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. భవిష్యత్తులో సంక్షేమ పథకాలు అందాలన్నా, రుణాలు రావాలన్నా టీడీపీ సభ్యత్వం తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని వారిపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, సెల్‌ఫోన్‌ తీసుకుని తప్పనిసరిగా రావాలని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఫోన్లు చేసి మరీ హుకుం జారీ చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల గ్రూపుల్లో సైతం ఈ తరహా మెసేజ్‌లు పంపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆ శాఖకు చెందిన కొందరు అధికారులే డ్వాక్రా మహిళలకు నేరుగా ఫోన్లు చేసి మరీ టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని సూచనలిస్తున్నట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే సభ్యత్వ నమోదుపై ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘం అధ్యక్షురాళ్లను రంగంలోకి దింపుతున్నారు. ఆమె తన గ్రూపులోని సభ్యులకు ఫోన్లు చేసి తెలుగుదేశం సభ్యత్వాలు తీసుకునేలా సూచనలిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో ఎటువంటి పథకాలూ వర్తించవని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద బీమా, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వంటివి పొందాలంటే టీడీపీ సభ్యత్వం తప్పనిసరని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో చేసేది లేక మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చెప్పినట్లు సభ్యులు సంతకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సభ్యత్వ నమోదు పేరుతో ఆయా మహిళల ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా పుస్తకం జిరాక్స్‌లు తీసుకుంటున్నారు. నమోదు చేసిన వెంటనే ఆయా మహిళల మొబైల్‌ నంబర్లకు ఓటీపీ వస్తోంది. ఆ ఓటీపీతో లాగిన్‌ అయ్యి టీడీపీ సభ్యత్వం ధ్రువీకరిస్తున్నారు. ఈ తంతు జిల్లాలో వేగంగా సాగుతోంది. ఈ విధానం ద్వారా లక్షల్లో సభ్యత్వాలు పెంచుకునేందుకు టీడీపీ నేతలు వ్యూహం రచిస్తున్నారు. ఇలా అడ్డగోలుగా సభ్యత్వాలు చేయించి, దీనిని చూపి, వారందరూ టీడీపీ విధానాలకు ఆకర్షితులై తమ పార్టీలో చేరారని తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బలవంతపు సభ్యత్వం!1
1/1

బలవంతపు సభ్యత్వం!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement