మోహిని అలంకరణలో గోదాదేవి
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో ధనుర్మాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉత్సవమూర్తి గోదాదేవి మోహిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాస పూజల్లో భాగంగా ముందుగా ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి తోపాటు శ్రీ గోదాదేవి అమ్మవారిని యాగశాలలో కొలువుంచి వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ కనులపండుగగా నవకలశ స్థాపన, పంచామృతాభిషేకం, తిరుమంజనం, అర్చన నిర్వహించారు. తర్వాత ఉత్సవ మూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం క ల్పించారు. ఉత్సవమూర్తి గోదాదేవిని మోహిని దేవిగా అలంకరించి మాడ వీధుల్లో ఊరేగించా రు. ఈ కార్యక్రమం కనుల పండువగా సాగింది.
పదోన్నతులకు నేడు కౌన్సెలింగ్
కర్నూలు సిటీ: మున్సిపల్ స్కూళ్లలో ఎస్జీటీలుగా పని చేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు గురువారం కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అర్హుల సీనియారిటీ జాబితా డీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉందని, జాబితాలో ఉన్న వారు తమ సేవ పుస్తకం, అర్హత ధ్రువీకరణ పత్రాలు (రెండు సెట్లను)తీసుకొని డీఈఓ ఆఫీస్‌లో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు.
సా..గుతున్న
కంప్యూటరీ కరణ!
● కేడీసీసీ బ్యాంక్‌లో పూర్తిగా నిలిచిన రుణాల పంపిణీ
● కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తికాక
పోవడమే అందుకు ప్రధాన కారణం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటరీకరణ సాగుతూనే ఉంది. దీని వల్ల రుణాల పంపిణీ ప్రక్రియ పూర్తిగా బంద్ అయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఫిబ్రవరి నెలలో జాతీయ స్థాయిలో పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి పీఏసీఎస్‌కు రూ.4 లక్షలు కేటాయించింది. కర్నూలు జిల్లాలో 43 పీఏసీఎస్‌లు ఉండగా... ప్రీ మైగ్రేషన్‌కు వచ్చింది కేవలం 26 సంఘాలు మాత్రమే. ఇందులో కూడా 23 సంఘాల్లోనే ప్రీ మైగ్రేషన్ పూర్తి అయింది. అంటే 50 శాతం సంఘాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి అయింది. మిగిలిన వాటిలో ప్రీ మైగ్రేషన్ ఎప్పటికి పూర్తవుతుందనేది జవాబు లేని ప్రశ్న. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న లావాదేవీలను కూడా కంప్యూటరీకరణ చేయాల్సి ఉంది. అక్టోబరు 2 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం. అయితే, డిసెంబరు నెల ముగింపునకు వస్తున్నా పూర్తి కాలేదు. అధికారులు కూడా ఈ ప్రక్రియ పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment