జైలు.. జరిమానా
మద్యం తాగి వాహనం నడపడం చట్టరీత్యా నేరం అని అందరికీ తెలిసిన విషయమే. ఇలా చేస్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష వేస్తారని కూడా మందు బాబులు తెలుసుకోవాలి. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడవితే మొదటిసారి రూ.10,000 వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. రెండో సారి కూడా ఇదే తప్పు చేస్తే రూ.15,000 వరకు జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఇలాంటి సంఘటనల్లో ఎవరికై నా ప్రాణాపాయం కలిగితే జైలు శిక్ష కూడా రెండేళ్లు ఉండేది. కొత్త చట్టం ప్రకారం మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే మరణాలకు ఐదు సంవత్సరాల వరకు తప్పనిసరి జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా జరిమానా కూడా ఎక్కువగా వేస్తారు. ఒకవేళ ప్రమాదం చేసిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి మరణానికి సరైన కారణం చెప్పకపోతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో సహా అదనపు కఠినమైన శిక్షలు విధించే విధంగా చట్టాన్ని మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment