కరుణామయుడు.. వెలుగై వచ్చెను!
వెలుగోడులోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేస్తున్న క్రైస్తవులు
లోకానికంతటికీ వెలుగులు పంచిన బాల యేసు జన్మదినం ఆధ్యాత్మిక కిరణాలు ప్రసరింపజేసింది. ప్రభునామాన్ని స్మరించుకుంటూ క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. కొవ్వుత్తులు వెలిగించి లోక రక్షకుడికి స్వాగతం పలికారు. క్రీస్తు నేడు పుట్టును.. అని జయజయధ్వానాలు చేస్తూ వాడవాడలా పండుగ చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. క్రీస్తు పుట్టుకను స్వాగతిస్తూ అర్ధరాత్రి నుంచే సంబరాలు చేశారు. క్రైస్తవులు భారీగా చర్చిలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనా మందిరాల్లో దైవ సందేశకులు క్రిస్మస్ సందేశం ఇచ్చారు. లోకాన్ని రక్షించేందుకే క్రీస్తు జన్మించారని, ఆయన చూపిన మార్గంలో నడవాలన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ వంటి క్రీస్తు సందేశాలు మనలను సన్మార్గంలో నడిపిస్తాయని చెబుతూ, అందరిపై క్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని పాస్టర్లు ప్రార్థించారు.
–నంద్యాల (న్యూటౌన్)/వెలుగోడు
Comments
Please login to add a commentAdd a comment