విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
మద్దూరు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల హాస్టల్ వార్డెన్లకు సూచించారు. ఆదివారం మండలంలోని పెదిరిపాడ్లోని కేజీబీవీ, మద్దూరులోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ రెండు చోట్ల విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను ప్రశ్నించారు. వంట గదులు, ముత్రశాలలను, బియ్యం నిల్వలు, పప్పు, కురగాయాలను పరిశీలించారు. బియ్యం బాగో లేకపోతే మా దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, శుచిశుభ్రత కలిగిన భోజనం అందించాలని అమె సూచించారు. కార్యక్రమంలో వార్డెన్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment