మద్దూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి, కుల గణన సర్వే వివరాల ఆన్‌లైన్ ప్రక్రియను జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ ఆదివారం ఎంపీడీఓ కార్యాలయంలో పరిశీలించారు. ఉమ్మడి మద్దూరు మండలంలో దాదాపు 18వేల ఇళ్లలో సర్వే ఇప్పటికే పూర్తయిందని, ఎన్యుమరేటర్లు సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్ చేయడం కోసం మద్దూరు ఎంపీడీఓ కార్యాలయంలో 24, కొత్తపల్లిలో 5 డేటా ఎంట్రీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ నర్సింహరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఉమ్మడి మండలంలో దాదాపు 900 ఇళ్ల డేటాను అన్‌లైన్‌లో ఎంట్రీ చేసినట్లు డీపీఓకు వివరించారు. ఈ నెల 29 వరకు డేటా ఎంట్రీని పూర్తి చేయాలని అపరేటర్లకు డీపీఓ సూచించారు. ఎంపీఓ రామన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment