వైభవంగా ప్రజాపాలన విజయోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ప్రజాపాలన విజయోత్సవాలు

Published Mon, Nov 25 2024 7:25 AM | Last Updated on Mon, Nov 25 2024 7:25 AM

వైభవంగా ప్రజాపాలన విజయోత్సవాలు

వైభవంగా ప్రజాపాలన విజయోత్సవాలు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం నుంచి శనివారం వరకు మహబూబ్‌నగర్‌లో పెద్దఎత్తున రైతు సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో ప్రజా విజయోత్సవ సభ, రైతు సదస్సు నిర్వహణపై ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన చేస్తున్న ప్రజా ప్రభుత్వం సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిపేందుకు శనివారం ప్రజా విజయోత్సవ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. అలాగే భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌లో నిర్వహించే రైతు సదస్సులో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలను భాగస్వాములు చేస్తూ వైభవంగా నిర్వహిస్తామన్నారు. రైతు సదస్సులో వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించి 150 స్టాళ్లు ఏర్పాటు చేస్తామని, ఇందులో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, నూతన పద్ధతులు, అధునాతన యంత్ర పరికరాలు, వంగడాలు, విత్తనాలు సంబంధించి రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. ఏడాది కాలంలో రైతులు, మహిళలు, యువతకు సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ పాలమూరు ముఖ్యమంత్రి సొంత జిల్లా అని, సీఎం పాల్గొననున్న రైతు సదస్సును ఘనంగా నిర్వహించాలని సూచించారు. సదస్సులో రైతులకు స్ప్రింక్లర్లు, డ్రిప్‌, ఇరిగేషన్‌ ప్రదర్శనలు, పామాయిల్‌ సాగుపై అవగాహన కలిగించాలన్నారు. సమావేశంలో మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ విజయేందిర, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

30న సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

రైతు సదస్సులో ప్రజాప్రతినిధులు,

ప్రజలను భాగస్వామ్యం చేయాలి

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement