నేటి షెడ్యూల్..
రైతు సదస్సులో భాగంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లాకు చెందిన సైంటిస్టులు కూరగాయలు, పండ్లు, పూల పంటల సాగులో వంగడాలు, నూతన సాంకేతిక విధానాలను వివరించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన హార్టికల్చర్ అధికారులు ఉద్యాన పంటల ప్రణాళిక, సాగు.. ఆయిల్‌పాం సాగు, డ్రిప్, స్ప్రింక్లర్లు, సబ్సిడీ, ఉద్యానవనాల సమగ్రాభివృద్ధి, సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు పశువుల ఉత్పత్తిలో సీడింగ్ నిర్వహణ–నూతన సాంకేతికత వినియోగంపై, పశుసంవర్ధక శాఖ అధికారులు పశువుల్లో వచ్చే వ్యాధులు–నియంత్రణ, మత్స్య శాఖ అధికారులు మిశ్రమ చేపల పెంపకంపై, అధునాతన పద్ధతిలో చేపల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment