‘విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం’
నారాయణపేట ఎడ్యుకేషన్: వసతి గృహాలు, కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాసిరకమైన ఆహారం అందింస్తూ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని, జిల్లాలో 15 రోజుల్లో రెండు సార్లు విద్యార్థులు అస్వస్థతకు గురవడం ఇందుకు నిదర్శనమని ఏబీవీపీ నాయకుడు ఇంతియాజ్ అన్నారు. గురువారం నాసిరకమైన భోజనం అందించడంపై నిరసనగా ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా ఆడుతుందో ఈ ప్రభుత్వం అదే దారిలో వెళ్తుందని, వసతిగృహాలు, కేజీబీవీల్లో కనీస వసతులు లేక విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. నాణ్యత లేని మధ్యాహ్న భోజనం తిని ఒకే సంవత్సరంలో 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని, వారు ఎలాగోలా మృత్యువుని జయించారన్నారు. ఈ రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి మంత్రి ఉన్నాడు కానీ, విద్యాశాఖకు మంత్రి లేకపోవడం గమనార్హమన్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో నరేష్, సతీష్ , ఓంకార్, చరణ్ రెడ్డి. వెంకటేష్ నవీన్ రాకేష్ అరుణ్ షేక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment