విద్యార్థుల హాజరు అంతంతే..
మక్తల్/మాగనూర్: మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ బేన్ షేలం మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించారు. ఉదయం 10 గంటలకు పాఠశాలకు చేరుకోగా.. ఆయన ఆధ్వర్యంలోనే మధ్యాహ్న భోజనం వండారు. పాఠశాలలో మొత్తం విద్యార్థులు 575 మంది కాగా.. గురువారం కేవలం 270 మంది మాత్రమే హాజరయ్యారు. 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం పాఠశాలను సందర్శించి పూర్తి వివరాలపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించిన విషయం తెలిసిందే. వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో మిగతా విద్యార్థులను సైతం వారి తల్లిదండ్రులు బడికి పంపేందుకు వెనకాడుతున్నారు. దీంతో రెండురోజులుగా హాజరు శాతం సగానికి పడిపోయింది. ఇదిలాఉండగా, తహసీల్దార్ యాదయ్య, ఎంఈఓ, ఎంపీడీఓ మొదటగా మధ్యాహ్న భోజనం రుచి చూసి అనంతరం విద్యార్థులకు వడ్డించారు.
మాగనూరు జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment