గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
నారాయణపేట రూరల్/మరికల్/ధన్వాడ: గ్రామా ల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట మండలం షేర్నపల్లి, మరికల్ మండలం పూసల్‌పహాడ్, ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామాల్లో పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గ్రామాల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమాల్లో డీఆర్డీఓ మొగులయ్య, ఏఈ ప్రవీణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంపురం సదాశివరెడ్డి, సూర్యమోహన్‌రెడ్డి, నరహరి, హర్షవర్ధన్‌రెడ్డి, వీరన్న, మల్లారెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, గోపాల్, హరీష్, రాములు, కృష్ణయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment