ఏం కూడు పెడుతున్నారు..
మా బిడ్డలకు ఏం కూడు పెడుతున్నారు? మధ్యాహ్న భోజనం తింటే ఎందుకు వాంతులు అవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కరువైంది, బియ్యం, కూరగాయలు, నీళ్లు సరిగా లేవు. పూర్తిగా విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– మారేమ్మ, మాగనూర్
తీవ్రంగా కడుపునొప్పి..
మధ్యాహ్నం భోజనం చేసిన కొంత సమయానికి తీవ్ర కడుపునొప్పి వచ్చి వాంతులయ్యాయి. మొదట నాకు కడుపునొప్పి రావడంతో విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపాను. కొంత సమయం బయట కూర్చొని ఉండగా.. వాంతులు మొదలయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు మమ్మల్ని ఆస్పత్రికి తరలించారు.
– లక్ష్మణ్, విద్యార్థి, 7వ తరగతి
Comments
Please login to add a commentAdd a comment