మరికల్‌లో తెరుచుకున్న చెక్‌పోస్టు
మరికల్: మండల కేంద్రంలో మూతపడ్డ వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్టును అధికారులు తిరిగి తెరించారు. మార్కెట్ శాఖ అనుమతులు లేకుండా పక్క రాష్ట్రాలకు ధాన్యం లారీలు తరలిపోతున్న విషయాన్ని మంగళవారం ‘సాక్షి’లో ఽ‘ధాన్యం తరలుతోంది’ శీర్షికన కథనం ప్రచురితమవగా..పేట మార్కెట్ శాఖ అధికారులు స్పందించారు. బుధవారం చెక్‌పోస్టును తెరిపించారు. జిల్లాలో పలు గ్రామాల్లో దళారులు మార్కెట్ శాఖ ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా తరలిస్తున్న ధాన్యం లారీలు, డీసీఎంలను మార్కెట్ శాఖ సిబ్బంది పరిశీలించారు. అనుమతి లేని వాటికి మార్కెట్ ఫీజు వసూలు చేసి రసీదు అందజేశారు. మాధవరం గ్రామం నుంచి ధాన్యం లోడుతో హైదరాబాద్‌కి వెళ్తున్న ధాన్యం లోడు డీసీఎంను సైతం పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో మార్కెట్ ఫీజు కట్టించుకొని రసీదు అందజేసి పంపించారు. ధాన్యంతో వస్తున్న వాహనాలను తనిఖీ చేశారు.
అనుమతి లేని ధాన్యం లారీల పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment