ముగిసిన
జిల్లాలో 99.5 శాతం పూర్తి
డేటా ఎంట్రీ వేగవంతం
: వీసీలో కలెక్టర్
జిల్లాలో సమగ్ర సర్వే 99.5శాతం పూర్తి అయ్యిందని ఈనెల 28 లోగా సర్వే డేటా ఎంట్రీ పూర్తి చేస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ వీసీలో వివరించారు. ఆదివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని, సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైందని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క రాంచి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తేయని, వారికి ఫోన్ కాల్ చేసి సర్వే తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమ బద్ధకరించుకోవాలన్నారు. కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని, పాఠశాలలో ఆహారం, పరిశుభ్రత పై ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ ప్రత్యేక దృష్టికి సాధించిందని, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు తలెత్తకూడదనే మెస్, కాస్మోటిక్స్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ట్రైనీ కలెక్టర్ గరిమ నరుల అదనపు కలెక్టర్ బెన్‌షాలం సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నారాయణపేట ఎంపీడీఓ
కార్యాలయంలో డేటా ఎంట్రీని
పరిశీలిస్తున్న కలెక్టర్ సిక్తాపట్నాయక్
నారాయణపేట: జిల్లాలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వే ముగిసింది. కలెక్టర్ దిశానిర్దేశం, ఇతర జిల్లా అధికారుల పర్యవేక్షణ నడుమ 15 రోజులుగా ఇంటింటి సమగ్ర సర్వే చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 1181 మంది ఎన్యుమరేటర్లు ఈ నెల 6వ తేదీ నుంచి 8 వరకు 1,55,999 నివాస గృహాలను గుర్తించి స్టిక్కర్లు అంటించగా.. 9వ తేదీ నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించి శుక్రవారంతో పూర్తి చేశారు. గ్రామాల్లో, మున్సిపాలిటీ కేంద్రాల్లో సర్వే చేపట్టిన సమయంలో 118 మంది సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలను సమర్పించారు.
సమాచారం సగమే
ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను నమోదు చేసుకుంటున్న సమయంలో 75 రకాల ప్రశ్నలకు సమగ్ర సమాచారం ఇచ్చేందుకు జనం జంకుతూ కనిపించారు. వివరాలు సేకరించేందకు ఒక్కో ఇంటికి 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టింది. సర్వేలో సగం సమాచారం మాత్రమే ఎన్యుమరేట్లు సేకరించారు. సర్వే ఫారంలోని 56 ప్రశ్నలు...అనుబంధ ప్రశ్నలతో కలిపి 75 ప్రశ్నలకు ఎవరూ స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని చెప్పవచ్చు. యాజమానులు ఏ పనిచేస్తున్నారంటే చేసే పని కాకుండా ఇతర పనులను చెప్పినట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూములు తప్పా ఇతర స్థిర, చరాస్థుల వివరాలను చెప్పేందుకు ఇష్టపడలేదు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం పూర్తి స్థాయిలో వివరాలు తెలియజేయలేదని తెలుస్తోంది. ఆస్తులు, వార్షిక ఆదాయం, ఐటీ చెల్లింపులు, వాహనాలు తదితర విషయాలను చేప్పేందుకు ముందుకు రాలేదనేది బహిరంగ సమాచారమే. ఇంటి యాజమానులు ఏం చేప్తే వాటిని సర్వే ఫారాలలో ఎన్యుమరేటర్లు నమోదు చేశారు.
సర్వే వివరాల కంప్యూటరీకరణ
వేగవంతం
మొత్తం 1.56 లక్షల కుటుంబాల వివరాల సేకరణ
పాల్గొన్న 1,181 మంది ఎన్యుమరేటర్లు.. 118 మంది సూపర్‌వైజర్లు
Comments
Please login to add a commentAdd a comment