అగర్తల: పాకిస్తాన్ ఏర్పడేందుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. సోమవారం(సెప్టెంబర్16) త్రిపురలో సిద్ధేశ్వరి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని విభజించేలా ముస్లిం లీగ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిందన్నారు.
1905లో బెంగాల్‌ను విభజించేందుకు బ్రిటిషర్లు ప్రయత్నం చేయగా ప్రజల తిరుగుబాటుతో అది విఫలమైందని గుర్తు చేశారు. ఇదే విధంగా ముస్లిం లీగ్ ప్రయత్నాలను కాంగ్రెస్ వ్యతిరేకించి ఉంటే పాకిస్తాన్ ఏర్పాటయ్యేది కాదని యోగి అన్నారు. సీఎం యోగి పాకిస్తాన్‌ను క్యాన్సర్‌తో పోల్చారు. పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై యోగి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి.. తొలి నమో భారత్ రైలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment