మార్కెటింగ్ ఏడీని నిలదీస్తున్న రైతులు
రాస్తారోకో, భారీగా నిలిచిన వాహనాలు
భైంసాటౌన్: పత్తి కొనుగోళ్ల నిలిపివేతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భైంసా పట్టణంలోని పార్డి(బి) బైపాస్ వద్ద భైంసా–నిర్మల్ రహదారిపై సోమవారం బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రైతులకు సమాచారం లేకుండా పత్తి కొనుగోళ్లు నిలిపేయడంపై మండిపడ్డారు.
దీంతో గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, ఏడీఎం శ్రీనివాస్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. సీసీఐ నిబంధనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్‌మిల్లుల్లో సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిచాయని తెలిపారు.
ఈ విషయమై తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని, విషయం తెలియక వాహనాల్లో పత్తి తీసుకువచ్చి ఇబ్బంది పడ్డామని రైతులు అసహనం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు సముదాయించడంతో ఆందోళన విరమించారు. మధ్యాహ్నం తర్వాత పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment