ఆంక్షల నడుమ అమ్మవారి దర్శనం
దిలావర్‌పూర్: దిలావర్‌పూర్, గుండంపల్లి గ్రామా ల నడుమ నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో ఫ్యాక్ట రీ పరిసర ప్రాంతంలో రైతు వెంకట్రాంరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఇటీవల నిర్మించిన దుర్గాదేవి ఆలయానికి గుండంపల్లి గ్రామానికి చెందిన మహిళలు శుక్రవారం కాలినడకన వచ్చారు. మొదట పోలీసులు వారిని అడ్డుకున్నారు. తాము భక్తి భావనతో అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నామన్నా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో గ్రామస్తులు భారీగా చేరుకుని తమ గ్రామానికి చెందిన మహిళా భక్తులు అమ్మవారి దర్శనానికి మాత్రమే వెళ్తున్నారని, తమకు ఎలాంటి ఇబ్బంది కలుగనివ్వరని హామీ ఇవ్వడంతో బందోబస్తు మధ్య మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమ గ్రామ పరిసరాల్లో స్వేచ్ఛగా తిరగకుండా పోలీసులు ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ తమ ప్రాంతంలో తాము తిరగడానికి ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొమ్ముకాస్తూ తమను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment