నిర్మల్
కళ్లముందే కబ్జా
జిల్లాలో చెరువుల ఆక్రమణకు అడ్డుకట్ట పడటంలేదు. జిల్లా కేంద్రంలోనే గొలుసుకట్టు చెరువులు కబ్జాకు గురవుతున్నాయి.
చెరువుల సందర్శన
జిల్లాలోని తుర్కం, యెంగన్న చెరువులను ఐటీకోస్ బృందం సందర్శించింది. వీరికి అధికారులు బస ఏర్పాటు చేశారు.
9లోu
ఆదివారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2024
8లోu
జిల్లా కేంద్రంలో తనిఖీలు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కాలనీలో శనివారం టౌన్, రూరల్ పోలీసులు జాగి లాలతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్, రూరల్ సీఐలు ప్రవీణ్‌కుమార్, రామకృష్ణ, మాట్లాడుతూ.. గంజాయి డ్రగ్స్ సేవించే వారిపై కేసులు నమోదు చేస్తామన్నా రు. గత నిందితులకు తల్లిదండ్రుల సమక్షంలో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పోలీస్ అధికారులు ప్రేమ్‌కుమార్, లింబాద్రి, రవికుమార్, డాగ్ స్క్వాడ్ టీం, సిబ్బంది ఉన్నారు.
● ఇక్కడే ఉండే అవకాశాలు లేవా?
● ఉచ్చులు, వేటగాళ్లతో ప్రమాదమా?
● స్థిరంగా ఉండేందుకు అడ్డంకేంటీ?
● జిల్లా అడవులకు వచ్చివెళ్తున్న పులి
నిర్మల్: జానీ మళ్లీ వచ్చింది. నిర్మల్ జిల్లా అడవుల్లోకి తిరిగి అడుగుపెట్టింది. ఇక్కడే ఉంటుందో, తిరిగి ఎటైనా వెళ్లిపోతుందో తెలియదు. ఎక్కడో తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వందల కిలోమీటర్లు దాటి ఇక్కడి దాకా వస్తోందంటే ఇక్కడ దానికి కావాల్సిన అనుకూలతలు ఎంతోకొంత ఉన్నట్లే. కానీ.. పెద్దపులి జిల్లాలో స్థిరంగా ఎందుకు ఉండట్లేదన్నదే ప్రశ్న. ఇప్పుడు జానీ వచ్చివెళ్తున్నట్లే, గతంలోనూ ఎన్నో పెద్దపులులు జిల్లాకు వచ్చివెళ్లాయి. ఒకట్రెండు ఇక్కడే ఉచ్చులు, వేటగాళ్లకు బలైపోయాయి. మిగతావి తిరిగి వచ్చిన దారినే వెళ్లిపోయాయి. తాజాగా నెలరోజుల నుంచి తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన జానీ అనే పెద్దపులి నిర్మల్–ఆదిలాబాద్ అడవుల్లో తిరుగుతోంది. దానికి కావాల్సిన తోడు కోసం వెదుకుతూనే ఉంది. ఇలా వచ్చిన పులులు ఇక్కడే ఉండాలంటే ఏం చేయాలన్న చర్చ కూడా సాగుతోంది.
పులి ఉండాలంటే ఏం చేయాలంటే..
మిగతా అటవీ జంతువులతో పోలిస్తే పెద్దపులి తీరు కొంత వేరుగానే ఉంటుంది. ఇందులోనూ ఆడపులి తాను ఉన్న ప్రదేశం నుంచి 6–7కిలోమీటర్ల పరిధిలోనే సంచరిస్తుంది. కానీ,, మగపులి తోడు–నీడ కోసం వందల కిలోమీటర్లయినా నడుస్తూనే ఉంటుంది. అరణ్యంలో తనకంటూ కంఫర్ట్‌జోన్‌ను ఎంచుకుంటుంది. ఇలా కంఫర్ట్‌జోన్‌తో పాటు మేటింగ్ కోసమే జానీ అనే పులి వందల కిలోమీటర్లు వాకింగ్ చేస్తూనే ఉంది. జిల్లా అడవుల్లోనే పెద్దపులులు స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలంటే.. అవి వేటాడి ఆహారంగా తీసుకునేందుకు కావాల్సిన జింకలు, దుప్పులు లాంటి వన్యప్రాణుల సంఖ్య పెరగాలి. వన్యప్రాణుల సంఖ్య పెంచాలంటే విస్తారంగా గడ్డిక్షేత్రాలు, నీటివసతులు కల్పించాలి. ఈ దిశగా అటవీశాఖాధికారులు కృషిచేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని రాంపూర్, మైసంపేట్ గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలించారు. మరో రెండుమూడు గ్రామాలు ఇంకా అడవుల్లోనే మిగిలాయి. ప్రధానంగా పులి మనుగడకే ప్రమాదంగా మారే ఉచ్చులు, కరెంట్‌తీగలు, వేటగాళ్ల భయం లేకుండా చూడాలి. ఇందుకోసం అటవీశాఖలో సరిపడా అధికారులు, సిబ్బందినీ పెంచాల్సిన అవసరముంది. అటవీశాఖకు జిల్లావాసులూ సహకరిస్తేనే నిర్మల్ జిల్లా పెద్దపులులకు ఆవాసంగా మారుతుంది. అప్పుడు.. టైగర్‌లను చూసేందుకు ఎక్కడో ఉన్న తాడోబా, తిప్పేశ్వర్ అ భయారణ్యాలకు వెళ్లాల్సిన అవసరమూ ఉండదు.
మనిషి అంటేనే భయం
న్యూస్‌రీల్
కవ్వాల్ ‘గుడ్’.. కానీ..
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో భాగంగా ఉండే కొండలు, దట్టమైన అడవులతో ఉంటుంది. 2012లో కేంద్రప్రభుత్వం దేశంలో 41వ, రాష్ట్రంలో రెండో పులుల అభయారణ్యంగా కవ్వాల్‌ను ప్రకటించింది. ఇది దాదాపు 2,020 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇందులో 897 చదరపు కిలోమీటర్లు పెద్దపులి సంచరించే కోర్ ఏరియాగా, 1,123 చదరపు కిలోమీటర్లు వేటాడే బఫర్ ఏరియాగా విభజించారు. నాలుగేళ్లక్రితం దాదాపు ఎనిమిది పెద్దపులులు, నాలుగు కూనలు అభయారణ్యంలో తిరిగాయి. కవ్వాల్‌కు వచ్చిన ఒక్క ఫాల్గుణ అనే పులి ఏడు పిల్లలకు జన్మనిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) జాబితాలోనూ కవ్వాల్ రేటింగ్ ‘ఫెయిర్’ నుంచి ‘గుడ్’ స్థానానికి పెరిగింది. కానీ.. పులుల రాక మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు.
కుంటాల మండలంలో ఇటీవల కనిపించిన పెద్దపులి
బెబ్బులిని చూస్తే అడవి భయపడుతుంది. అలాంటి పులి కూడా మనిషిని చూస్తే బెదురుతోంది. ఎక్కడ కరెంట్ షాక్ పెట్టి చంపుతాడో.. ఎందులో విషం కలిపి ఉసురు తీస్తాడో.. అని భయపడుతూనే ఉంది. అందుకే దట్టమైన అడవుల్లోనే ‘బతుకు జీవుడా..’ అనుకుంటూ బతుకుతోంది. గత కొన్నేళ్లుగా అడవుల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎన్నో పులులు వేటగాళ్ల ఉచ్చులు, స్మగ్లర్ల స్కెచ్‌లకు బలైపోయాయి. 2018లోనే వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో వైల్డ్ లైఫ్ క్రైం సెంట్రల్ టీమ్ సభ్యులు ఇచ్చోడలో ఓ పులిచర్మం పట్టుకోవడం సంచలనమైంది. ఈ కేసులో కూపీ లాగితే, పెంబి మండలం తాటిగూడకు చెందిన ఇద్దరు అదే మండలంలోని పుల్గంపాండ్రి అడవుల్లో ఆ పులిని చంపినట్లు తేలింది. విద్యుత్ ఉచ్చుతో పులిని హతమార్చినట్లు గుర్తించారు. అదే సమయంలో పాత మంచిర్యాల బీట్‌లో చిరుతను హతమార్చడం, శివ్వారం బీట్‌లో ఏకంగా రాయల్ బెంగాల్ టైగర్‌ను మట్టుబెట్టడం తీవ్ర సంచలనం సృష్టించింది. కవ్వాల్ అడవుల్లోకి వచ్చిన పులిని వచ్చినట్లే చంపుతుండటంపై సర్కారు సీరియస్ అయ్యింది. ఏకంగా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీఎఫ్)తో పాటు నాలుగు జిల్లాల్లోని పలువురు డీఎఫ్‌వోలు, ఎఫ్‌ఆర్వోలు, ఎఫ్‌ఎస్వోలు, ఎఫ్‌బీవోలను బదిలీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment