‘సరిహద్దు’లో కమల వికాసం
నిర్మల్: సరిగ్గా ఏడాదిక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని సరిహద్దు ముధోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఆ రాష్ట్ర సరిహద్దులో గల మూడు నియోజకవర్గాల్లో కమలం వికసించింది. ఇక్కడి ఓటర్ల ప్రభావంతోపాటు నేతల ప్రచారం మహారాష్ట్ర సరిహద్దు నియోజకవర్గాల ఫలితాల్లో కనిపించినట్లు తెలుస్తోంది.
మూడుచోట్ల జయకేతనం..
జిల్లా సరిహద్దున గల కిన్వట్‌లో భీంరావుకేరమ్, ధర్మాబాద్‌లో రాజేశ్‌పవార్ బీజేపీ నుంచి గెలుపొందారు. అలాగే భోకర్‌లో మాజీ ముఖ్యమంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన అశోక్‌రావు చౌహాన్ కూతురు శ్రీజ చౌహాన్ కూడా విజయం సాధించారు. సరిహద్దు జిల్లాకేంద్రమైన నాందేడ్‌లో బాలాజీ కల్యాణ్‌కర్ కమలదళం నుంచే గెలిచారు. ఆయా నియోజకవర్గాల్లో జిల్లాకు చెందిన ఓటర్లు చాలాచోట్ల కీలకంగా ఉన్న విషయం తెలిసిందే.
పనిచేయని ‘హ స్తం’ మంత్రాంగం
ఈసారి మహారాష్ట్ర ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. జిల్లా సరిహద్దులోని మరాఠా ని యోజకవర్గాలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి చూసుకున్నారు. ఎన్నికలకు ముందు భైంసాలో మూడురోజులపాటు మకాం వేసి మహారాష్ట్రలో మంత్రాంగం నడిపారు. కానీ.. ఎక్కడా ఆయన ప్రభావం కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీకి ఓట్లు భారీగానే వచ్చినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
బీజేపీ విజయోత్సవాలు
నిర్మల్‌చైన్‌గేట్: మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఘనవిజయం సాధించగా శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో సంబరాలు జరుపుకొన్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్‌రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, అయ్యన్నగారి భూమయ్య, నారాయణరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, రాజు, సాగర్, శ్రావణ్‌రెడ్డి, అరవింద్, సుధాకర్, భాస్కర్, నరేశ్, శ్రావణ్, దిలీప్, భరత్, సత్యనారాయణ, నర్సయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment