నాణ్యమైన ధాన్యం తేవాలి
లోకేశ్వరం: కొనుగోలు కేంద్రాలకుకి రైతులు నాణ్య మైన వరి ధాన్యం తీసుకువచ్చి మద్దతుధర పొందా లని అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ సూచించారు. శనివారం మండలంలోని హవర్గ, కిష్టాపూర్, లోకేశ్వరం, నగర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో వారంరోజు ల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించామని, గన్నీ బ్యా గులు, లారీల కొరత లేకుండా చూస్తున్నట్లు తెలిపా రు. అనంతరం నగర్ గ్రామ శివారు ప్రాంతంలోని గోదాంలను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్వో కిరణ్‌కుమార్, తహసీల్దార్ మోతీరాం ఉన్నారు.
నర్సాపూర్ (జి): మండలంలోని రాంపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్ పరిశీలించారు. కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. సేకరించిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. డీఎస్వో కిరణ్‌కుమార్, ఐకేపీ సీసీ ముత్యం తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment