వాతావరణం
ఆకాశం స్వల్పంగా మేఘావృతమవుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. చలితీవ్రత పెరుగుతుంది. మంచు కురుస్తుంది.
మెరుగైన వసతులు
కల్పించకుంటే చర్యలు
మామడ: విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించకుంటే కఠినచర్యలు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. శనివారం మామడ కేజీబీవీని అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్‌తో కలిసి సందర్శించారు. తరగతి గదులు, వంట గది, మరుగుదొడ్లు, స్నానపు గదులు పరిశీలించి నిత్యం శుభ్రంగా ఉంచేలా చూడాలని అధికారులకు సూచించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం, నాణ్యమైన వంట సరుకులు, కూరగాయలు వాడాలని, పాఠశాల ప్రాంగణంలో పిచ్చిమొక్కలు తొలగించాలని సూచించారు. కనీస వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నందున ప్రత్యేకాధికారి, ఎంపీడీవోకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఈవో రామారావు, ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, కేజీబీవీ కోఆర్డినేటర్ సలోమి కరుణ, ఎంఈవో వెంకటరమణారెడ్డి అధికారులు, సిబ్బంది ఉన్నారు.
అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కేంద్రంలోని నాయుడువాడ–1 అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ అభిలాష్ అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్‌లో చిన్నారులకు పంపిణీ చేసే పాలు, గుడ్లను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం గురించి తెలుసుకున్నారు. అనంతరం సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. నిర్మల్ సీడీపీవో నాగమణి, ఏసీడీపీవో నాగలక్ష్మి, సూపర్‌వైజర్ విజయగౌరి, జిల్లా పోషణ కోఆర్డినేటర్ నిరంజన్‌రెడ్డి, అంగన్‌వాడీ టీచర్ శాలిని, ఆయా స్వరూప ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment