26న జిల్లాకేంద్రంలో నిరసన కార్యక్రమాలు
ఖానాపూర్: కేంద్రం అవలంబిస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 26న జిల్లా కేంద్రంలో నిరసనలు చేపట్టనున్నట్లు ఐఎఫ్టీ యూ జిల్లా అధ్యక్షుడు సునారికారి రాజేశ్ తె లిపారు. ఆదివారం పట్టణంలోని సీపీఐఎంఎ ల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో మా ట్లాడారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనల్లో కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కోశాధికారి దుర్గం లింగన్న, నాయకులు గోనె స్వామి, గూట్ల ప్రసాద్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment