జిల్లా సందర్శనలో ట్రైనీ ఐఏఎస్‌లు
లక్ష్మణచాంద: మండలంలోని పొట్టపెల్లి (కే) గ్రా మంలో ఆదివారం ట్రైనీ ఐఏఎస్ అధికారులు పర్యటించారు. ట్రైనీ అధికారుల్లో రవికాంత్ (ఐఎ ఫ్‌ఎస్), ప్రేక్షణ జైన్ (ఐడీఈఎస్), రాకేశ్ (ఐఆర్‌ఎ స్), రితు సుందరం (ఐపీ టీఏఎఫ్‌ఎస్) తదితరులు న్నారు. వీరికి ఎంపీడీవో రాధ స్వాగతం పలికారు. అనంతరం వీరు జనాభా, వసతులు, ప్రజలకు అందుతున్న వివిధ పథకాల గురించి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, పల్లె ప్రకృతివనం, నర్సరీలు, గోదాం, సెగ్రిగేషన్ షెడ్డు ను పరిశీలించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని పరిశీలించి సాగు వివరాలు తెలుసుకున్నారు. వారి వెంట ఎస్సై సుమలత, ఏపీవో ప్రమీల, ఏపీఎం వాణిశ్రీ, ఎంపీవో అమీర్‌ఖాన్, టీఏలు దినేశ్, భీమ్, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, హెచ్‌ఎం సత్యనారాయణ, అంగన్‌వాడీ టీచర్ సునీత, ఎఫ్‌ఏ శ్రీనివాస్ తదితరులున్నారు.
నిర్మల్ రూరల్: మండలంలోని చిట్యాల, నీలాయిపేట గ్రామాలను ట్రైనీ ఐఏఎస్‌లు పరిశీలించారు. అధికారులతో సమావేశమై చేపట్టిన పనుల వివరా లు తెలుసుకున్నారు. పాఠశాలలు, శ్మశాన వాటికలు, చెక్‌డ్యామ్, నర్సరీలు, క్రీడాప్రాంగణం, పల్లెప్రకృతి వనం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సాగు వివరాలు తెలుసుకున్నారు. ఎంపీడీవో గజా నన్, ఎంఈవో వెంకటేశ్వర్, ఐకేపీ ఏపీఎం బోసు, క్లస్టర్ సీసీలు నర్సయ్య, జ్యోతిర్మయి ఉన్నారు.
నర్సాపూర్(జి): మండల కేంద్రంలోని కేజీబీవీని ట్రైనీ ఐఏఎస్‌లు సందర్శించారు. సౌకర్యాలు, బోధ న తీరు గురించి ఎస్వో వీణను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం రైతువేదికలో ఏర్పాటు చేసిన అంగ న్‌వాడీ, ఆశ కార్యకర్తల సమావేశంలో సమస్యలపై చర్చించారు. 30 పడకల సామాజిక ఆస్పత్రిని సందర్శించి సేవల గురించి తెలుసుకున్నారు. వీరి వెంట ఎంపీడీవో పుష్పలత, డీటీ వాహీదొద్దీన్, ఎంపీవో తిరుపతిరెడ్డి, ఆర్‌ఐ వేణుగోపాల్, పంచాయతీ కార్యదర్శి రాథోడ్ కై లాస్ తదితరులున్నారు.
సోన్: మండలంలోని న్యూబొప్పారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, పీహెచ్‌సీని ట్రైనీ ఐఏఎస్‌లు పరిశీలించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద చేపట్టిన ఇంకుడుగుంతలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాలు, మిషన్ భగీరథ, పల్లె ప్రకృతివనం, ప్రజాపంపిణీ వ్యవస్థ గురించి తెలు సుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయ భవనంలో మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై బ్యాంక్ రుణాలు, ఉపయోగాల గురించి ఆరా తీశారు. వీరి వెంట ఎంపీడీవో సురేశ్, తహసీల్దార్ మల్లేశ్, గ్రామ ప్రత్యేకాధికారి రాజమల్లు, ఎంపీవో షేక్‌ఖలీల్ హైమద్, ఏపీవో మంజులారెడ్డి, ఐకేపీ ఏపీఎం గంగామణి, పంచాయతీ కార్యదర్శి అశోక్, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల పరిశీలన
ప్రభుత్వ పథకాల గురించి ఆరా
Comments
Please login to add a commentAdd a comment