ఇంటింటి సర్వేకు సహకరించాలి
ధర్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు వాస్తవ సమాచారా న్ని అందించాలన్నారు. ధర్పల్లి మండలంలోని సీ తాయిపేట్‌లో నిర్వహిస్తున్న సర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. సర్వే కోసం అతికించిన స్టిక్కర్లను వాటిపై నమోదు చేసిన ఇంటి నంబర్, ఎన్యూమరేషన్ బ్లాక్ తదితర వివరాలను తనిఖీ చే శారు. తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా సర్వే జరపాలని అధికారులను ఆదేశించారు. జిల్లా లో ఇంటింటి సర్వే కోసం 3,245 ఎన్యుమరేటర్లను నియమించామని తెలిపారు. సర్వేలో భాగంగా ఈ నెల 8వ తేది వరకు హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, 9వ తేదీ నుంచి సమగ్ర కుటుంబ వివరాల సేకరణ ప్రారంభమవుతుందని వివరించారు.
లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ
జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. సీతాయిపేట్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే నిర్దేశిత రైస్‌మిల్లులకు పంపించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మాలతి, ఎంపీడీవో బాలకృష్ణ ఉన్నారు.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
Comments
Please login to add a commentAdd a comment