ఆవిష్కరణల్లో స్టాటిస్టిక్స్ పాత్ర కీలకం
తెయూ(డిచ్‌పల్లి): నూతన ఆవిష్కరణల్లో సాంఖ్యాక శాస్త్రం(స్టాటిస్టిక్స్) పాత్ర కీలకమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావు అన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటి స్టిక్స్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(టీజీసీవోఎస్‌టీ) సంయు క్తంగా బుధవారం యూనివర్శిటీలో అవగాహన సదస్సు నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ.. గణాంకశాస్త్ర భావనలు ప్రధానంగా శాస్త్ర సాంకేతిక ప్రసార రంగాన్ని బలోపేతం చేసి సమాజ పురోభివృద్ధికి దారి చూపాయన్నారు. రిజిస్ట్రార్ యాదగిరి మా ట్లాడుతూ పరిశోధనలు, సాంఖ్యాక శాస్త్రం ఆవశ్యకతను తెలిపారు. కార్యక్రమంలో టీజీసీవోఎస్‌టీ వర్సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ హెచ్‌వోడీ సంపత్ కుమార్, సైన్స్ డీన్, కళాశాల ప్రిన్సిపాల్ ఆరతి, అధ్యాపకులు పురుషోత్తం, రాజేశ్వర్, నర్సింలు, సందీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment