సంక్షిప్తం
గడుగు గంగాధర్‌కు సన్మానం
నిజామాబాద్ సిటీ: జిల్లాకేంద్రంలోని దుబ్బ హింగుళాంబికా ఆలయానికి విచ్చేసిన రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్‌ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి, సన్మానించారు. అర్చకులు ప్రసాదాలు అందజేశారు.
నేటి నుంచి గురుకుల పాఠశాలల సందర్శన
నిజామాబాద్‌అర్బన్: బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నేటి(ఆదివారం) నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాలో ప్రతి గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తమని బీఆర్‌ఎస్ నాయకుడు అభిలాష్‌రెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి గురుకుల పాఠశాలను పర్యవేక్షణ చేయాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయకులు ప్రశాంత్, కునాల్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
నియామకం
నిజామాబాద్ సిటీ: మహారాష్ట్రలోని వరోరా అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కో–ఆర్డినేటర్‌గా నగరానికి చెందిన కాప్‌కర్ ఘన్‌రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం నుంచి నియామక పత్రం విడుదలచేశారు. ఈసందర్భంగా పార్టీ అగ్ర నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ల అందజేత
బోధన్‌టౌన్: పట్టణంలో గతంలో ఫోన్లను పొగొట్టుకున్న పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురి ఫోన్లను రికవరీ చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో శనివారం సదరు బాధితులకు సీఐ వెంకట నారాయణ ఫోన్లను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment