గోవులను పూజించే గొప్ప సంస్కృతి మనదే..
సుభాష్‌నగర్: సకల దేవతలకు నిలయమైన గోవులను పూజించే గొప్ప సంస్కృతి కేవలం మన హిందూధర్మం, భారతదేశంలోనే ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నా రు. నగరంలోని గోపాల్‌బాగ్ గోశాల కమిటీ ఆధ్వర్యంలో శనివారం గోపాష్టమి మహోత్సవం నిర్వహించారు.ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. గోవులను పెంచే బాధ్యత, రక్షించుకోవాల్సి న ఆవశ్యకత హిందువులుగా మనందరిపై ఉందన్నారు. ఆవులకు ప్రమాదాలు, అనారోగ్యానికి గురై న సమయంలో పశు ఆస్పత్రికి తరలించేందుకు అ వసరమైన వాహన సర్వీస్‌ను ఉచితంగా తన ట్రస్ట్ ద్వారా అందిస్తానని హామీనిచ్చారు. అనంతరం గో మాతకు పూజ కార్యక్రమాలు నిర్వహించి, అన్నదా నం ఏర్పాటు చేశా రు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమా ర్, ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి, గోపాల్‌బాగ్ గోశాల కమిటీ అధక్షుడు కోలా రామ్, కార్యదర్శి మాస్టర్ శంకర్, కమల్ కిషోర్ ఇనానీ, కోశాధికారి ధన్‌పాల్ శ్రీనివాస్, ట్రస్టీ కై లాస్ బోయంకర్, వడ్డి మోహన్‌రెడ్డి, మోటూరి దయానంద్ గుప్త పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: నగరంలోని పలు ప్రాంతాలలో శనివారం విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు రేబ్బ ఆనంద్, జిల్లా సహకార్యదర్శి ధాత్రిక రమేష్, నికేష్, సుధీర్, కసబ్ గల్లి నరేష్, స్వామినాథ్, ప్రణయ్ ఉన్నారు. అలాగే గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో పెద్దరాంమందిర్ గోశాలలో గోపూజ చేశారు. సమితి అధ్యక్షుడు తొడుపునూరి రామ్మోహన్, కోశాధికారి అర్వపల్లి బాలశేఖర్, వ్యాస్, రాజశేఖర్, దయాకర్, సతీష్, నగేష్, కౌటిక శంకర్, అమర్, బాలకృష్ణ ఉన్నారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment