సర్వేలో నిర్లక్ష్యం చేయవద్దు
డిచ్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర సర్వేలో ఉద్యోగులు, సిబ్బంది ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ సూచించారు. మండలంలోని ఘ న్పూర్ గ్రామంలో సోమవారం నిర్వహిస్తున్న సర్వే ను ఆయన పరిశీలించారు. ఎన్యుమరేటర్లకు పలు సూచనలు, సలహాలు చేశారు. సర్వే పూర్తయ్యే వర కు మండలస్థాయి అధికారులు పర్యవేక్షణ చేయా లని తహసీల్దార్ ప్రభాకర్‌ను ఆదేశించారు. ప్రజలు అధికారులకు సహకరించి వారు అడిగిన వివరాల ను అందించాలని సూచించారు. ఆర్ఐ రెవెన్యూ ఇ న్స్పెపెక్టర్ సంతోష్, రమేష్, కలెక్టర్ రవి ఉన్నారు.
సిరికొండ: మండలంలో సమగ్ర ఇంటింటి సర్వే కొనసాగుతోంది. కుర్దుల్‌పేట్, జగదాంబ తాండ, న్యావనంది గ్రామాల్లో తహసీల్దార్ రవీందర్రావు, పాకాల, దుప్య తండాలో ఎంపీడీవో కేఆర్ మనోహర్‌రెడ్డి, మండల కేంద్రంలో ఎంపీవో తారాచంద్ సర్వేను సోమవారం పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment