రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం
మోపాల్(నిజామాబాద్‌రూరల్):రైతును రాజు చే యడమే కాంగ్రెస్ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ, రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్ర భుత్వం చేస్తున్న కార్యక్రమాలపై బీఆర్‌ఎస్, బీజే పీ చేస్తున్న ఆరోపణల్లో పస లేదని విమర్శించారు. మండలకేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. రైతులతో మా ట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూపతిరె డ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చివరి గింజ వరకు ధా న్యం సేకరిస్తామని, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ధాన్యం సేకరిస్తున్నామన్నారు.
సర్వేపై అపోహలు వద్దు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావొద్దని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. మోపాల్‌లో సమగ్ర కుటుంబ సర్వేను ఆయన పరిశీలించారు. ఎన్యుమరేటర్లకు పలు సూచనలు, సలహాలు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖ ర్ గౌడ్, ఎంపీడీఓ రాములు నాయక్, తహసీల్దార్ రామేశ్వర్, సొసైటీ చైర్మన్లు గంగారెడ్డి, మోహన్‌రెడ్డి, నాయకులు సాయిరెడ్డి, సతీష్‌రెడ్డి, బోర్గాం శ్రీనివాస్, సుదర్శన్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం..
జక్రాన్‌పల్లి: ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన గన్యతండా పిర్‌సింగ్, తొర్లికొండ కనుక రవి సోమవారం నిజామాబాద్ రూరల్ ఎ మ్మెల్యే భూపతిరెడ్డిని కలిసి, సన్మానించారు. నాయకులు జైడి చిన్నారెడ్డి, వినోద్, చిన్నసాయిరె డ్డి, అ నంత్‌రెడ్డి, వసంతరావు, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మణ్, నర్సారెడ్డి, సాయిరెడ్డి, వినోద్ పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
మోపాల్‌లో కొనుగోలు కేంద్రం పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment