గ్రంథాలయంలో మధ్యాహ్న భోజనం ప్రారంభం
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు సోమవారం ధన్పాల్ లక్ష్మీభాయ్–విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు రెండువందల మందికి ఉచిత మధ్యాహ్న భోజనం సౌకర్యాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి సన్మానించారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలన్నారు. యువతలో నిరుద్యోగిత తగ్గించడం కోసం తనవంతుగా ఆరు నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా నిర్వహిస్తానని అన్నారు. బీజేపీ నాయకులు శివునూరి భాస్కర్, పవన్ ముందడ, మరవర్ కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment