వివరాలు పక్కాగా సేకరించాలి
నిజామాబాద్ సిటీ: నగరంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో భాగంగా సిబ్బంది ప్రజల నుంచి వివరాలు పక్కాగా సేకరించాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ తెలిపారు. కార్పొరేషన్ పరిఽధిలో నిర్వహిస్తున్న సర్వేను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని ఖానాపూర్, కాలూరు, గాయత్రినగర్, కోటగల్లిలో తిరుగుతూ సర్వే తీరును పరిశీలించారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లతో మాట్లాడారు. సర్వే పనితీరును అడిగి తెలుసుకున్నారు.
డాటా ఎంట్రీకి సెంటర్ సిద్ధం.
కార్పొరేషన్ పరిఽధిలో నిర్వహిస్తున్న సమగ్ర సర్వే డాటాను ఎంట్రీ చేసేందుకు కంప్యూటర్ సెంటర్ ఏర్పాటుచేశారు. ఆదివారం బల్దియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంటర్‌ను మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్యుమరేటర్లు రోజు చేసిన సర్వే వివరాలు ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయాలన్నారు. ఎంట్రీలో తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలని సూచించారు. తప్పుడు ఎంట్రీ వల్ల సమస్యలు వస్తాయని, వాటిని నివారించాలంటే ముందుగానే వివరాలు పూర్తిగా నమోదు చేయాలన్నారు. అనుమానాలుంటే సూపర్‌వైజర్‌లను అడిగి తెలుసుకోవాలన్నారు. మేనేజర్ జనార్ధన్ తదితరులు ఉన్నారు.
మోపాల్ మండలంలో..
మోపాల్: మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఆదివారం రెండోరోజు కొనసాగింది. మోపాల్, కులాస్‌పూర్, సింగపల్లి, బాడ్సి, మంచిప్ప, బైరాపూర్ తదితర గ్రామాల్లో సర్వేను నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, ప్రత్యేకాధికారి గోవింద్‌రావు పరిశీలించారు. ఎన్యుమరేటర్లు ఏమైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తేవాలని వారికి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో సర్వేను పకడ్బందీగా చేపట్టాలని, ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని తెలిపారు. కాగా కాల్‌పోల్ తండా, శ్రీరాంనగర్ తండాల్లో మతూర లంబాడీలు సర్వేకు సహకరించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడి సూచనల మేరకు సర్వే బహిష్కరిస్తున్నామని మతూర లంబాడీలు పేర్కొంటున్నారు. తహసీల్దార్ రామేశ్వర్, ఎంపీఓ కిరణ్‌కుమార్ ఉన్నారు.
మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్
నగరంలో సమగ్ర సర్వే పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment