కొనసాగిన ‘టాలెంట్ షో’
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని విజయ్ హైస్కూల్‌లో ఆదివారం 44వ టాలెంట్ షో కొనసాగింది. కార్యక్రమంలో వసంత టూల్స్ క్రాప్ట్ ప్రవేటు లిమిటెడ్ ఫౌండర్ దయానంద్‌రెడ్డి పాల్గొని, మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ చూపాలని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల కరస్పాండెంట్ అమృతలత, ప్రిన్సిపాల్ ప్రభాదేవి, వసంత, సుజాత, విజేత, అంబిక, అనంద్ తదితరులు పాల్గొన్నారు.
రేషన్ దుకాణం ప్రారంభం
మోపాల్: మండలంలోని తాడెం గ్రామంలో నూతనంగా మంజూరైన రేషన్ దుకాణాన్ని ఆదివారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ సూర్యారెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. గ్రామంలో రోడ్డు, చెక్‌డ్యాం సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే నిధులు మంజూరయ్యే విధంగా చూస్తామన్నారు. అనంతరం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, నాయకులు, గ్రామస్తులు రాజారెడ్డి, సాయికుమార్, ప్రభాకర్, రేషన్ డీలర్ సవిత, గంగారెడ్డి, నాగార్జున్, అరుణ్ పాల్గొన్నారు.
ఆశ్రమ నిర్మాణానికి
సహకారం అందిస్తా
నిజామాబాద్‌నాగారం: ఇందూరు యువత మనశ్శాంతి కోవెల ఆశ్రమ నిర్మాణానికి సహకారం అందిస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. నగరంలోని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయాన్ని ఆదివారం ఆయన పరీశీలించారు. ఈసందర్బంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తున్న ‘ఇందూరు యువత’ అందరికి ఆదర్శమన్నారు. నుడా చైర్మన్ కేశవేణు, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్‌నాయక్, నరాల రత్నాకర్, ఇందూరు యువత సంస్థ వ్యవస్థాపకుడు సాయిబాబు, ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment