గెలుపోటములు సహజం
నిజామాబాద్ నాగారం: క్రీడల్లో గెలుపోటములు సహజమని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నగరంలోని ఆఫీసర్స్ క్లబ్‌లో రెండు రోజులుగా సాగుతున్న బ్యాడ్మింటన్ టోర్నీ ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ప్రతి రోజు క్రీడలకు సమయాన్ని తప్పకుండా కేటాయించలన్నారు. ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్‌బిన్ మాట్లాడుతూ నిజామాబాద్ అంటేనే ఎంతో మంది క్రీడాకారులకు పుట్టిన ఇల్లుగా మారిందన్నారు. విజేతలకు జడ్జి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, జాయింట్ సెక్రెటరీ వెంకట్‌రాములు, ట్రెజరర్ గంగకిషన్, ప్రముఖ వ్యాపారవేత్త దేవిదాస్, ఏటీఎస్ శ్రీనివాస్, భక్తవత్సలం, న్యాయవాదులు మానిక్‌రాజ్, ఆశానారాయణ పాల్గొన్నారు.
లింబాద్రి గుట్టను
దర్శించుకున్న జడ్జీలు
మోర్తాడ్: భీమ్‌గల్ మండలంలోని లింబాద్రి గుట్టపై నెలకొన్ని శ్రీ లక్ష్మీ నర్సింహస్వామిని జిల్లా జడ్జీ కుంచాల సునీత, ఆర్మూర్ జడ్జీ దీప్తి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారితో ప్రత్యేక పూజలను చేయించి తీర్థ ప్రసాదాలను అందించారు.
శాఖ గ్రంథాలయాల బలోపేతానికి కృషి
జక్రాన్‌పల్లి: జిల్లాలో ఉన్న శాఖ గ్రంథాలయాలను బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. ఆదివారం జ క్రాన్‌పల్లి మండలంలోని అర్గుల్‌లో శాఖ గ్రంథాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. శాఖ గ్రంథాలయాల్లో త్వరలోనే వైఫై ఏర్పాటు చేయిస్తామన్నారు. అదేవిధంగా అవసరమైన ఫర్నిచర్ సమకూరుస్తామని పేర్కొన్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో గ్రంథాలయాల భవవ నిర్మాణాల ఏర్పాటు కోసం కృషి చేస్తానని తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను గ్రంథాలయా ల్లో అందుబాటులో ఉంచామన్నారు. జీపీల్లో చెల్లిస్తున్న సెస్‌ను గ్రంథాలయాలకు కేటా యించాలని కలెక్టర్‌ను కోరామని తెలిపారు. అర్గుల్ లైబ్రరీలో బోరుమోటరు, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. అర్గుల్ నర్సయ్య, గోర్త రాజేందర్, గ్రంథ పాలకుడు నరేష్‌రెడ్డి, సొప్పరి వినోద్, అక్బర్, గంగాధర్, ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment