డీఏపీ కొరత రాకుండా చర్యలు
డొంకేశ్వర్(ఆర్మూర్): పంటలకు ఎరువుగా వినియోగించే డై అమ్మోనియం పాస్పెట్ (డీఏపీ) కొరత వచ్చే అవకాశాలు ఉండడంతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. డీఏపీకి ప్రత్యామ్నాయంగా వేరే ఎరువులను వాడాలని రైతులకు సూచన లు చేసింది. అయితే జిల్లాలో డీఏపీ కొరత ఎంత మాత్రం లేదని, మార్క్‌ఫెడ్, సొసైటీలు, డీలర్ల వద్ద కలిపి మొత్తం 2,278 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్ వెల్లడించారు. రైతులు అవసరానికి తగ్గట్లుగానే డీఏపీ బస్తాలు కొనుగోలు చేసుకోవాలని, తొందరపడి నిల్వ చేసుకోవద్దని సూచించారు. డీఏపీ స్థానంలో పీఎస్‌బీ, కాంప్లెక్స్ ఎరువులు, ఎస్‌ఎస్‌పీ, బాటిళ్లలో దొరికే డీఏపీ వాడుకోవచ్చని సూచించారు. వీటిని రైతులు వాడే విధంగా విస్తృతంగా అవగాన కల్పించాలని ఏవోలు, ఏఈవోలకు ఆదేశాలిచ్చారు.
వేరే రాష్ట్రాల్లో ఏర్పడిన కొరత..
అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశంలో డీఏపీ దిగుమతి తగ్గిపోయింది. పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో కొరత ఏర్పడంది. దీంతో అక్కడి రైతులు డీఏపీ బస్తాల ధరలు పెరిగినప్పటికీ అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రభావం మన రాష్ట్రంపై కూడా పడింది. డీఏపీ బస్తాల ధరలు పెంచి అమ్ముతున్నారు. కొరత వచ్చే అవకాశం ఉండవచ్చని భావించిన ప్రభుత్వం వ్యవసాయ శాఖ ను అప్రమత్తం చేసింది. జిల్లాల వారీగా డీఏపీ నిల్వల వివరాలను తెప్పించుకుంది. పక్షం రోజు ల్లో యాసంగి సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు డీఏపీని కొనుగోలు చేయనున్నారు. అడుగు మందుగా పిలిచే దీనిని ఎక్కువగా వరి, మొక్కజొన్న, ప సుపు పంటలకు వినియోగిస్తారు. రెండు ఎకరాలకు మూడు బస్తాల వరకు వాడుతారు. నిజామాబాద్ జిల్లాలో సాగయ్యే పంటల్లో 80 శాతం వరి ఉంటుంది. యాసంగిలో 4.17 లక్షల ఎకరాల్లో వరి సాగవనున్న ట్లు వ్యవసాయ శాఖ అంచనా వే సింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డీఏపీ నిల్వలు సరిపోతాయ ని అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో డీఏపీ నిల్వలు ఇలా
అప్రమత్తమైన వ్యవసాయ శాఖ
ప్రత్యామ్నాయ ఎరువులు వాడాలని రైతులకు సూచన
Comments
Please login to add a commentAdd a comment