గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
ధర్పల్లి: జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్పల్లి గ్రంథాలయ ఆధునికీకరణకు రూ.5లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. పాఠకుల కోసం అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లైబ్రేరియన్ కిషన్, కాంగ్రెస్ నాయకులు చెలిమెల నర్సయ్య, బాలయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment