‘లోక్‌మంథన్’లో కోలాట బృందం
మోపాల్: హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న భారతదేశ అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవం లోక్‌మంథన్ భాగ్యనగర్–2024లో మండలంలోని బాడ్సి నుంచి వెళ్లిన సుమారు 50 మంది భక్త మార్కండేయ కోలాట బృందం తన ప్రదర్శన ఇచ్చింది. గురువు మహిపాల్‌రెడ్డి, సహ గురువు దశరథ్ ఆధ్వర్యంలో బృందం కోలాటం ఆటను అద్భుతంగా ప్రదర్శించింది. లోక్‌మంథన్ కార్యక్రమంలో 12 దేశాల ప్రతినిధులు, 100 మంది వక్తలు, 350 ప్రదర్శనలు, 1500 మంది కళాకారుల మధ్య భక్త మార్కండేయ బృందం కోలాట ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుందని, ఈ బృందాన్ని నిర్వాహకులు అభినందించారని ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో కోలాటం సభ్యులు ఈరమ్మ జగదీశ్‌రెడ్డి, రవి, బక్కిలి మోహన్, గొడుగు గోపాల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment