కొడుక్కి తలకొరివి పెట్టిన తల్లి
దోమకొండ: మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా అతడి తల్లి తలకొరివి పట్టి, అంత్యక్రియలు నిర్వహించింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. దోమకొండకు చెందిన గుండా రాజేశ్(33) నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ధర్పల్లి నుంచి దోమకొండకు వస్తుండగా, రామారెడ్డి శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించగా తల్లి కుమారుడికి తలకొరివి పెట్టింది. మృతుడికి భార్య పద్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment