బాన్సువాడ: పాత నాణాలు ఇస్తే రూ.99లక్షలు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు చేసిన మోసానికి ఓ వ్యక్తి మోసపోయాడు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. బీర్కూర్ గ్రామానికి చెందిన నర్రె గంగారాం బతుకు దెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సంక్రాంతి సందర్బంగా ఇటీవల బీర్కూర్‌కు వచ్చిన ఆయనకు ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. పాత నాణేలు ఇస్తే రూ.99 లక్షలు ఇస్తామని చెప్పడంతో వెంటనే అందులో ఉన్న నంబర్‌కు గంగారాం ఫోన్ చేశాడు. రూపాయి, ఐదు, పది, 25, 50 పైసల నాణేలతో పాటు రూ.20, రూ.100, రూ.200 నోట్లు తీసుకుని రూ.99 లక్షలు ఇస్తామని చెప్పడంతో గంగారాం నమ్మాడు. ఇందుకు కొంత ఖర్చు అవుతుందని తెలపడంతో గంగారాం విడతల వారీగా రూ.1.80లక్షలు ఓ డిజిటల్ యాప్ ద్వారా సైబర్ నేరగాళ్లకు చెల్లించాడు. ఈ నెల 17న మళ్లీ నేరగాళ్లు ఫోన్ చేసి రూ.99 లక్షలు ఇవ్వాలంటే ఎయిర్‌ఫోర్టుకు కారు, రక్షణ సిబ్బందికి, జీఎస్టీకి కలపి రూ.లక్ష ఖర్చు అవుతుందని ఆ నగదు పంపించాలని చెప్పారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన గంగారాం బీర్కూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment