ముంపు భూముల్లో సాగు
● ఎస్సారెస్పీ నీటి మట్టం తగ్గడంతో
బయట పడిన భూములు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ముంపు భూ ముల్లో వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి మట్టం తగ్గడంతో ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిలిచే నాగాపూర్, జలాల్‌పూర్, కోమన్‌పల్లి శివారులో భూములు బయట పడుతున్నాయి. దీంతో భూములు ప్రాజెక్ట్ కోసం కోల్పోయిన రైతులు అందులో వరి పంటను సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం యాసంగి సీజన్‌లో బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతం బయల్పడటంతో రైతులు పంటను సాగు చేసుకుంటారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు పూర్తి పరిహరం అందలేదు. దీంతో రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతునే ఉన్నారు. ఇలా భూములు బయట పడగానే పంటలను వేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment