గాంధీభవన్‌కు గద్దర్ పేరు పెట్టాలి
సుభాష్‌నగర్: సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ కార్యాలయ రోడ్డుకు గద్దర్ పేరు పెడతామనడం సరికాదని, ఆయనపై అంత ప్రేమ ఉంటే గాంధీభవన్‌కు, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి గద్దర్ పేరు పెట్టాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేశంగా శపథం చేశారని గుర్తుచేశారు. అర్బన్ నక్సలైట్ల మీద కాంగ్రెస్‌కు ఎందుకంత ప్రేమ వచ్చిందన్నారు. గద్దర్‌పై రాజద్రోహం సహా 35 కేసులు పెట్టి, జైలు పాలు చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అవకాశవాది అని, అధికారమే పరమావధిగా రాజకీయ సంచారం చేస్తున్నారని విమర్శించారు. ఎంతమంది రేవంత్‌రెడ్డిలు వచ్చినా బీజేపీ కార్యాలయ ప్రాంతం పేరు మార్చలేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు కాలం చెల్లినట్లేనని, దేశానికి నష్టం చేసే పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, ప్రధానకార్యదర్శి న్యాలం రాజు, నక్క రాజేశ్వర్, తిరుపతిరెడ్డి, పద్మారెడ్డి, బొబ్బిలి వేణు, నాయిడి రాజన్న, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కాసం వెంకటేశ్వర్లు
Comments
Please login to add a commentAdd a comment