బడ్జెట్‌పై మిశ్రమ స్పందన
దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తయారీ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర బడ్జెట్‌లో పలు ప్రకటనలు చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సమ్మిళిత అభివృద్ధి, పరిశ్రమలకు మద్దతు ఇచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని వస్తువులపై సుంకాలను తగ్గించారు. దీంతో ఎలక్ట్రానిక్స్, కీలక ఔషధాల ధరలు తగ్గనున్నాయి. మరికొన్ని వస్తువులపై మాత్రం కస్టమ్స్ డ్యూటీని పెంచారు. బడ్జెట్‌పై వివిధ రంగాలకు చెందిన వారు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా..
నిజామాబాద్ సిటీ: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంది. తెలంగాణకు మొండిచెయ్యి చూయించి ఎన్నికలు జరగబోతున్న బీహార్, ఢిల్లీలకు ఎక్కువ నిధులు కేటాయించారు. జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. పసుపు బోర్డుకు ప్రత్యేకంగా నిధుల ప్రస్తావన లేదు.
– ముష్క సుధాకర్, టీయూసీఐ, జిల్లా ప్రధాన కార్యదర్శి
కార్మిక ప్రజావ్యతిరేక బడ్జెట్
నిజామాబాద్ సిటీ: కేంద్ర బడ్జెట్ ప్రజా, కార్మిక వ్యతిరేకమైనది. చిన్న తరహా, మూతపడ్డ పరిశ్రమలు తెరిపించేందుకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు. తెలంగాణకు నిధులు కేటాయించలేదు. కార్మికుల వేతనాల పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయకపోవడం బాధాకరం.
– వై ఓమయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
బడ్జెట్ సంతృప్తికరంగా ఉంది
ఖలీల్‌వాడి: మధ్యతరగతి వారికి రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఊరట కలిగించింది. క్యాన్సర్‌కు సంబంధించిన కొన్ని మందులపై ఎలాంటి పన్నులు తగలకుండా బాధితులకు అండగా ఉంది. కానీ రైతులకు సంబంధించి పంట గిట్టుబాటు ధర రైతే నిర్ణయించుకునేలా విధివిధానాలు చేయాలి.
– దేగాం యాదగౌడ్, పార్లమెంట్ టీడీపీ కన్వీనర్
కార్పొరేట్ సంస్థలకు
మోకరిల్లే బడ్జెట్
నిజామాబాద్ సిటీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు మోకరిల్లేలా ఉంది. జాతీయ ఉపాధి హా మీ పథకానికి నిధులు తక్కు వ కేటాయించారు.రైతుల బాగోగులు పట్టించుకోలే దు.నిజామాబాద్ రైల్వే అభివృద్ధికి నిధులు కేటా యించలేదు. బీహార్‌కు అధిక నిధులు కేటాయించారు. – పెద్ది వెంకట్రాములు, తెలంగాణ వ్యవసాయ
కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment