జెండా బాలాజీ ఆలయంలో పూజలు
నిజామాబాద్ రూరల్: నగరంలోని శ్రీ జెండా బాలాజీ దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమం, అభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీరాం రవీందర్ గుప్తా, ఆలయ కార్యనిర్వారహణ అధికారి వేణు, ప్రశాంత్ కుమార్, జాలిగంగోపాల్, నర్సింగ్ రావు, రామా గౌడ్, ముత్యాల ప్రకాశ్ గుప్తా, చిన్న గంగారాం గుప్తా, కుర్ర శ్రీనివాస్ గుప్తా భక్తులు పాల్గొన్నారు.
గడ్కోల్‌లో ఆలయవార్షికోత్సవం
సిరికొండ: మండలంలోని గడ్కోల్‌లో హనుమాన్ ఆలయ దశమ వార్షికోత్సవ వేడుకలను శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో మూలవిరాట్‌ను సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. గ్రామ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వినియోగదారులకు
అనుగుణంగా బ్యాంకు సేవలు
నిజామాబాద్ రూరల్: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బ్యాంక్ సేవలు అందించాలని కెనరా బ్యాంక్ హైదరాబాద్ సీజీఎం చంద్రశేఖర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌లో హోటల్‌లో కెనరా బ్యాంక్ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో సత్యనారాయణ ‘కెనరా క్రెస్ట్’ అనే నూతన సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. వినియోగదారులు కెనరా క్రెస్ట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విద్యార్థులకు వాటర్
బాటిళ్ల పంపిణీ
జక్రాన్‌పల్లి: మండలంలోని బాలానగర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు బోర్గాంకు చెందిన దాత రాజశేఖర్‌రెడ్డి ఉచితంగా వాటర్ బాటిళ్లను వితరణగా అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సుసమంజన, ఉపాధ్యాయులు సునీత, సుజాత, రేవతి, శ్రీనివాస్, విఠల్‌రావు, ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment