పీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి
నిజామాబాద్ సిటీ: పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నరేందర్ రెడ్డి మెదక్–నిజామాబాద్–కరీంనగర్–ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారయ్యారు. తనను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
జక్రాన్‌పల్లి: రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో తొర్లికొండ విద్యార్థులు సత్తా చాటి పతకాలు సాధించారు. పాఠశాలలు శనివారం నిర్వహించిన సమావేశంలో ప్రతిభ చాటిన క్రీడాకారులను ఎంఈవో శ్రీనివాస్ అభినందించారు. ఈ నెల 13 నుంచి 17 వరకు మహారాష్ట్రలో నిర్వమించే జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పీడీ మర్కంటి గంగామోహన్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయిలు, రామకృష్ణ, గంగాధర్, నరసింహరావు, సునీత, కృష్ణ, మాలతి, పల్లె గంగాధర్, గౌతమి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి
రగ్బీ పోటీలకు ఎంపిక
సిరికొండ: రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు సిరికొండ ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్‌ఎం భోజరాం తెలిపారు. మంచిర్యాలలో ఈ నెల 2 నుంచి 4 వరకు నిర్వహించి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. పోటీలకు ఎంపికై న విద్యార్థులను పాఠశాలలో శనివారం అభినందించారు. పీడీ ప్రశాంత్ పాల్గొన్నారు.
వేడుకలను
విజయవంతం చేయాలి
తెయూ(డిచ్‌పల్లి): బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో తెయూలో ఘనంగా చేపట్టేందుకు నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు. శనివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మినీ సెమినార్ హాల్‌లో జరిగిన కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. సేవాలాల్ జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శాంతాదేవీ, కిరణ్ రాథోడ్, ప్రవీణ్‌కుమార్, బికోజి, రవీందర్, బబ్లు, దిలీప్, అశోక్, సాగర్, లక్ష్మణ్, శ్రీకాంత్, మోహన్, పృధ్వీ, రాజు, శేఖర్, రాము, సంజు, శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్‌అర్బన్: యూనివర్సిటీల్లో టీచర్ల పదవీ విరమణ వయస్సును పెంచడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని దుబ్బా చౌరస్తాలో పీడీఎస్‌యూ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు గణేశ్, నాగేశ్, నజీర్, రెహన్, సంతోష్, రాజు పాల్గొన్నారు.
నిరంతర విద్యుత్ సరఫరాకు ఇంటర్ లింక్ లైన్
సుభాష్‌నగర్: వినియోగదారులకు నాణ్యమైన, ని రంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నామని, ఏదైనా కారణాలతో సబ్‌స్టేషన్‌లో సరఫరా నిలిచిపోయినా విద్యుత్ సరఫరా చేసేందుకు ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశామని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ఆర్ రవీందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ సర్కిల్ పరిధిలో 216 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లలో, 19/33 కేవీ లైన్‌లలో ఇంటర్ లింకింగ్ వ్యవస్థ చేపట్టామని పేర్కొన్నారు. మరో 21 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, 21 33 కేవీ లైన్‌లను గుర్తించి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అవసరమైన లైన్‌ల ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టి నిరంతర విద్యుత్ సరఫరా దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment