‘ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా’
జక్రాన్‌పల్లి: పడకల్‌లో శ్రీ భూనీలా సమేత వేంకటేశ్వర ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. శనివారం జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్‌లో వేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఆలయంలో కల్యాణ మండపం కోసం ఎస్‌డీఎఫ్ నిధులతో రూ. 10లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను వీడీసీ, ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయారెడ్డి, వీడీసీ సభ్యులు ప్రసాద్, ధను, విజయ్, అర్వింద్, సుచిత్, ఎల్లుల్ల ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు రాజేశ్వర్, శ్రీనివాస్, జగన్, నాయకులు చిన్నారెడ్డి, చిన్న సాయారెడ్డి, కిషన్‌నాయక్, పురుషోత్తం, విఠల్, రాజేందర్, గంగారెడ్డి, జితేశ్, ప్రవీణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు
ధర్పల్లి: మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల కాలంలో తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని, రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల మయం చేశారని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం భవనంలో నిర్వహించిన భక్త మార్కండేయ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా కేసీఆర్ కుటుంబం మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ పై ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment