సదస్సుల ద్వారా మరింత విజ్ఞానం
డిచ్‌పల్లి: శాసీ్త్రయ సదస్సుల ద్వారా మరింత విజ్ఞానం పెంపొందించుకునే అవకాశం కలుగుతుందని రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. శనివారం బర్ధిపూర్ శివారులోని బృందావన్ గార్డెన్స్‌లో నిర్వహించిన 9వ తెలంగాణ రాష్ట్ర డెంటల్ సైన్స్ కాన్ఫరెన్స్‌లో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే పార్ధసారధి హాజరై మాట్లాడారు. దంత వైద్యంలో రోజు రోజుకూ మారుతున్న కొత్తకొత్త చికిత్స విధానాలపై అవగాహన పెంపొందించుకోవచ్చన్నారు. ఆరోగ్యశ్రీ కింద దంతవైద్యానికి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేర్చాలని కాన్ఫరెన్స్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ నర్సింహస్వామి, డాక్టర్ చలపతిరావు ఎమ్మెల్యేలకు విన్నవించారు. మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ జరగనుంది. దంత వైద్య విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యప్రదర్శన ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం ఎమ్మెల్యేలను నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో ఐడీఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నందకుమార్, డాక్టర్ ప్రతాప్‌కుమార్, డాక్టర్ విక్రమ్‌రెడ్డి, డాక్టర్ శ్రీను నాయక్, డాక్టర్ పరమేశ్వర్‌రెడ్డి, డాక్టర్ స్వామి, నిర్వాహకులు పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment