ఆశల సమస్యలను పరిష్కరించాలి
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆశ కార్యకర్తలు కోరారు. ఈమేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం ఆశ కార్యకర్తలు 10 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. తమకు ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. ఆశలకు నెలకు రూ.18వేల వేతనం ఇవ్వాలని, ప్రమోషన్, పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సీఐటీయూ నాయకులు రమేష్‌బాబు, నాయకులు సుకన్య, రేణుక, బాలమణి, రేణుక, రమ, రాధా, విజయ, తనుజ, వనిత, రేష్మ, లలిత, బాలమణి, భాగ్య, స్వప్న, లావణ్య, కవిత, లక్ష్మి, సాహిర, రేవతి, చందన, రేవతి తదితరులు పాల్గొన్నారు.
ఈ–ఔషధిపై శిక్షణ
నిజామాబాద్‌నాగారం: నగరంలో మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్ – మెడికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన వై ద్యాధికారులు, ఫార్మసిస్టులు, నర్సింగ్ ఆఫీ సర్లకు ఈ–ఔషదిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో రాజశ్రీ, డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస్ మాట్లాడు తూ.. జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జీజీహెచ్‌లో మందుల పంపిణీ, మందుల సరఫరా, ఈ ఔషధీ నిర్వహణ గురించి వివరించారు. అలాగే ముగ్గురు సభ్యులతో కూడి న బృందం ఈ ఔషధీని తనిఖీ చేయడం, మందులను తిరిగి సరఫరా చేయడం వంటివి చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఆస్పత్రుల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని, తగిన సలహాలు, సూచనలు చేశారు. రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందం జిల్లాకి ఏ సమయంలోనైనా విచ్చేసి ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేయనుందని, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డాక్టర్ రమేష్, రాథో డ్, అంజనా, రాజు తదితరులు పాల్గొన్నారు.
సైకిల్ యాత్రలో
జర్మనీ దంపతులు
బాల్కొండ: జర్మనీ దేశానికి చెందిన ఓ జంట ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈక్రమంలో మంగళవారం వారు ముప్కాల్ మండల కేంద్రం శివారుకు చేరుకోగా స్థానిక విద్యార్థులతో ముచ్చటించారు. ప్రపంచ దేశాల్లో సైకిల్ యాత్ర చేపట్టాలనే కాంక్షతో భారతదేశంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు 1265 కిలోమీటర్ల మేరా సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు వారు తెలిపారు. విద్యార్థులతో పలు అంశాలపై మాట్లాడుతూ ఆనందంగా గడిపారు.
గ్రంథాలయాలకు
భవన నిర్మాణాలు
నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని గ్రంథాలయాలకు నూతన భవనాలు నిర్మించేందుకు పాలకవర్గం ఆమోదం తెలిపింది మంగళవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రంథాలయ చైర్మన్ అంత రెడ్డి రాజారెడ్డి సమావేశ తీర్మానాలను వెల్లడించారు. రెంజల్, నవీపేట, ఆర్మూర్‌లలో నూతన భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. మూతపడిన గ్రామీణ గ్రంథాలయాలను తిరిగి ప్రారంభించాలని, సిరికొండ, పోచంపాడు, నందిపేట గ్రంథాలయాలకు నూతన భవన నిర్మాణా కోసం స్థల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment