భీమ్‌గల్ సీఐగా సత్యనారాయణ
మోర్తాడ్: భీమ్‌గల్ సీఐగా సత్యనారాయణ మంగళవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన నరేష్‌కుమార్‌పై పలు ఆరోపణలు రాగా అతడిని ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఆయన స్థానంలో రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో సీఐగా పని చేసిన సత్యనారాయణను భీమ్‌గల్‌కు ఉన్నతాధికారులు బదిలీ చేశారు.
కవల దూడలకు
జన్మనిచ్చిన ఆవు
రుద్రూర్: కోటగిరి మండలంలోని సుద్దులం గ్రామంలో మంగళవారం ఓ ఆవు కవల దూడలకు జన్మనిచ్చింది. గ్రామంలోని లక్ష్మణ్ అనే రైతుకు చెందిన ఆవుకు మంగళవారం రెండు దూడలకు జన్మించాయి. ప్రస్తుతం ఆవు, దూడలు ఆరోగ్యంగా ఉన్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు విషయం తెలుసుకుని చూసేందుకు వచ్చారు.
సదస్సును విజయవంతం చేయండి
తెయూ(డిచ్ పల్లి): హైదరాబాద్ సారస్వత పరిషత్‌లో ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘భారత రాజ్యాంగంపై సమీక్ష’ అనే అంశంపై నిర్వహించనున్న సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ జాగృతి విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు పసుల చరణ్ కోరారు. ఈమేరకు మంగళవారం ఆయన తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వద్ద సదస్సు పోస్టర్లను అధ్యాపకులు కనకయ్య, అబ్దుల్ ఖవి, జమీల్, నాగరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాయకులు సాజన్ శెట్టి, సత్యవతి, శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ, పులి జైపాల్, రాము, రవికాంత్, నితిన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment