ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరాలి
నిజామాబాద్‌అర్బన్: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ నెల 24 వరకు కొనసాగనున్న వార్డు, గ్రామ సభల నిర్వహణపై మంగళవారం రాత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొ న్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గ్రామ సభలలో మొ దటి రోజు ప్రజలు ప్రస్తావించిన అంశాల గురించి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని తెలిపారు. జనవరి 26 నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరో సా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకోని వారి నుంచి అర్జీలు స్వీకరించాలని సూచించారు. గ్రామ సభల అనంతరం ప్రజాపాలన సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తులు చేసుకోవ చ్చని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులతో పేర్కొన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం కతనిశ్చయంతో ఉందన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. మొదటి రోజు జిల్లాలో 201 గ్రామాలు, వార్డులలో సభలు జరి గాయని తెలిపారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో చదివి వినిపించాలని, ఎవరికై నా అభ్యంతరాలుంటే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిర్దేశించిన ప్రకారం వార్డు,
గ్రామ సభలు నిర్వహించాలి
సంక్షేమ పథకాల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం
మంత్రులతో కలిసి జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు
Comments
Please login to add a commentAdd a comment