ఎమ్మెల్సీ రేసులో..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆదిలాబాద్–నిజామాబాద్–కరీంగనర్–మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. అయితే ఇప్పటికే బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన సి అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్క కొమరయ్యలను ప్రకటించింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం పలువురు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక సీనియ ర్ జర్నలిస్ట్ స్వతంత్రంగా బరిలో ఉంటూనే బీఆర్‌ఎస్ మద్దతు కోరుతున్నారు.
● బీఆర్‌ఎస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన మాజీ మేయర్ రవీందర్‌సింగ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు, నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గానికి చెందిన రా జారాం యాదవ్ బీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం కోసం లా బీయింగ్ చేస్తున్నారు. మరోవైపు స్వతంత్రంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మాచర్ల గిరిధర్‌గౌడ్ బీఆర్‌ఎస్ మద్దతు కోరుతున్నారు.
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నుంచి మల్క కొమరయ్యను ప్రకటించారు. కాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నుంచి హడావుడి లేదు. ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేదంటున్నారు.
అల్ఫోర్స్
నరేందర్‌రెడ్డి
మదనం
గంగాధర్
కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీగా బరిలోకి దిగేందుకు కరీంనగర్‌కు చెందిన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. నరేందర్‌రెడ్డి గత రెండున్నర నెలలుగా స్వతంత్రంగా ప్రచారం చేసుకుంటున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగానికి వీఆర్‌ఎస్ ఇచ్చి వచ్చిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన మదనం గంగాధర్ సైతం పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి వచ్చారు. గంగాధర్ రెండు నెలలుగా నాలుగు జిల్లాల్లో తిరుగుతూ స్వతంత్రంగా ప్రచారం చేస్తున్నారు. ఈయన కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
Cç³µ-sìæMóS A¿ýæÅ-Æý‡$¦-ÌS¯]l$ ˘
ప్రకటించిన బీజేపీ
కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, మాజీ డీఎస్పీ మదనం గంగాధర్
బీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం
కోరుతున్న రవీందర్‌సింగ్, డాక్టర్ బీఎన్ రావు, రాజారాంయాదవ్
బీఆర్‌ఎస్ మద్దతు కోరుతున్న గిరిధర్ గౌడ్
Comments
Please login to add a commentAdd a comment